మహబూబ్‌నగర్ లో బస్సు దగ్ధం.. 16 మందికి గాయాలు

మహబూబ్‌నగర్ : మహబూబ్‌ నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి వద్ద అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ నుంచి ఏపీలోని ధర్మవరం వెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ లగ్జరీ బస్సు డీసీఎంను ఢీకొట్టింది. దీంతో మంటలు ఒక్కసారిగా చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్‌తో పాటు 15 మందికి గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.

➡️