ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి అధికారం కోల్పోవడం, టిడిపి అధికారాన్ని కైవశం చేసుకోవడంతో నామినేటెడ్ పోస్టుల్లో పనిచేస్తున్న కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యులు రాజీనామాలు చేయడం ప్రారంభించారు. శుక్రవారం స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ మల్లాది విష్ణు తన పదవికి రాజీనామా చేశారు. అదేవిధంగా ఎపి ఫైబర్‌నెట్ ఛైర్మన్ పి.గౌతమ్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.
