పలు రైళ్లు రద్దు

May 15,2024 08:53 #cancelled, #Many trains

ప్రజాశక్తి-విశాఖపట్నం : దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్‌లో భద్రతా పనుల కారణంగా పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు ఆ శాఖ అధికారులు మంగళవారం రాత్రి ప్రకటించారు. రైలు నెంబర్‌ 17239 గుంటూరు-విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు రద్దు చేశారు. రైలు నెంబర్‌ 17240 విశాఖపట్నం-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 16 నుంచి 27వ తేదీ వరకు రద్దుచేశారు. రైలు నెంబర్‌ 22701 విశాఖపట్నం-గుంటూరు ఉదరు ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు నడిచే రోజులలో విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. రైలు నెంబర్‌ 22702 గుంటూరు-విశాఖపట్నం ఉదరు ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు నడిచే రోజులలో విజయవాడ నుంచి బయలుదేరుతుంది. రైలు నెంబర్‌ 07466 రాజమండ్రి-విశాఖపట్నం, 07467 విశాఖపట్నం-రాజమండ్రి రైళ్లు ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు చేశారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తదనుగుణంగా వ్యవహరించాలని రైల్వే శాఖ అధికారులు అభ్యర్థించారు.

➡️