తెలంగాణ : 12 రోజుల్లో పెళ్లి ఉందనగా…. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని కొత్తగూడలో జరిగింది. విద్యశ్రీ (23) కొత్తగూడలోని హాస్టల్లో ఉంటూ… గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తుంది. మార్చి 17వ తేదీన విద్యశ్రీకి వివాహముంది. కాబోయే భర్తతో రేపు (గురువారం) ప్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళ్లాల్సి ఉంది. పెళ్లికి 12 రోజులు ఉందనగా… గత సోమవారం హాస్టల్ బాత్ రూంలో షవర్ రాడ్‌కు ఉరేసుకొని విద్యశ్రీ ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
