వలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు

Apr 12,2024 22:35 #Resignations, #volunteers

ప్రజాశక్తి-యంత్రాంగం:ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నాయని వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం 2950 మంది వలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. తమ రాజీనామా పత్రాలను పంచాయతీ, ఎంపిడిఒ కార్యాలయాల్లో, సచివాలయాల్లో అందజేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో 22 మంది, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో 17 మంది, టెక్కలి మండలంలో 30 మంది వలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం శభాష్‌పురంలో ఆరుగురు, ఆదోని మండలంలో 15 మంది, నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలంలో 18, ఆత్మకూరు మండలంలో 98 మంది తమ వలంటీర్లు తమ రాజీనామా పత్రాలను ఎంపిడిఒలకు అందజేశారు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొంకసింగి గ్రామానికి చెందిన తొమ్మిది మంది వలంటీర్లు తమ రాజీనామా పత్రాలను పంచాయతీ కార్యాలయంలో ఇచ్చారు. మునగపాక మండలంలో 80 మంది, అల్లూరి జిల్లా చింతూరు మండల కేంద్రంలోని 42 మంది రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలంలో నలుగురు, చాట్రాయి మండలంలో 112 మంది, టి.నరసాపురం మండలంలో తొమ్మిది మంది, ఉంగుటూరు మండలంలో 54 మంది వలంటీర్లు రాజీనామాలు చేశారు. ఎన్‌టిఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలంలో 98 మంది స్వచ్ఛందంగా రాజీనామా చేసి చేశారు. వారి రాజీనామాలను మండల అభివఅద్ధి అధికారి రమేష్‌కు అందించారు. మైలవరం మండలంలో వంద మంది వలంటీర్లు రాజీనామా పత్రాలను ఎంపిడిఒ శ్రీనివాసరావుకు అందజేశారు. వత్సవాయి మండలంలో 49 మంది రాజీనామా చేశారు.

➡️