హైదరాబాద్ : జనగామలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని విజయ షాపింగ్‌మాల్‌లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగగా.. షాపింగ్‌మాల్ పూర్తిగా దగ్ధమైంది. పక్కనున్న 5 షాపులకు మంటలు వ్యాపించాయి. తొలుత విజయ షాపింగ్‌మాల్‌లో మంటలు చెలరేగగా.. అనంతరం పక్కనే ఉన్న శ్రీలక్ష్మీ వస్త్ర దుకాణానికి మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడు గంటలు ప్రయత్నించినా ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. రూ.10 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.