ప్రజాశక్తి-గన్నవరం(కృష్ణా) : మైనర్ బాలికపై ఎనిమిది మంది కీచకులు అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు నాలుగు రోజులపాటు ఆమెను నిర్బంధించి, అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత తీసుకొచ్చి నడిరోడ్డుపై వదిలేశారు. ఆత్కూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జి.కొండూరుకు చెందిన బాలిక (14) ఈ నెల వీరపనేనిగూడెంకు వచ్చింది. 13వ తేదీ రాత్రి ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఈ క్రమంలో ఓ యువకుడు బాలికను జి.కొండూరులో దింపుతామని నమ్మించి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత బాలికపై మరో ఏడుగురు లైంగిక దాడికి పాల్పడ్డారు. చివరకు బాలికను సోమవారం ఆటోలో తీసుకొచ్చి ఎన్టీఆర్ జిల్లా మాచవరంలో వదిలేశారు. స్థానికుల ఆమెను గమనించి.. మాచవరం పోలీసులకు అప్పగించారు. బాలిక మాట్లాడలేని స్థితిలో ఉండటంతో పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
