మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ దొంగతనం

ఫిలింనగర్‌ : మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఫిలింనగర్‌లోని పొన్నాల ఇంట్లో లక్షన్నర నగదుతో పాటు భారీగా అభరణాలను దుండగులు చోరీ చేశారు. పొన్నాల భార్య అరుణా దేవి ఫిలింనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే ఈ చోరీ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

➡️