భారీగా ఐఎఎస్‌ల బదిలీ

Jul 21,2024 06:41 #IAS, #Massive transfer
  • సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ ఎమ్‌డిగా గిరీషా
  • ఎపిసిపిడిసిఎల్‌ ఎమ్‌డిగా రవిసుభాష్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఎఎస్‌లను బదిలీ చేసింది. ఈ మేరకు జిఓ ఆర్‌టి నెంబరు 1288ను శనివారం విడుదల చేసింది. ప్రభుత్వం ఏర్పడిన నెలరోజుల తర్వాత 62 మంది ఐఎఎస్‌ల బదిలీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. వీరిలో కొందరిని కమిషనర్లుగా, జాయింట్‌ కలెక్టర్లు, సబ్‌ కలెక్టర్లు, ప్రాజెక్టు డైరెక్టర్లుగా ప్రభుత్వం నియమించింది. మైనార్టీ సంక్షేమశాఖ కమిషనరుగా సిహెచ్‌ శ్రీదత్‌ను నియమించింది. ఆయనకు మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఐజి, కమిషనరుగా ఎంవి శేషగిరి, హ్యాండ్‌లూమ్స్‌, టెక్ట్స్‌టైల్స్‌శాఖ కమిషనరుగా రేఖారాణి, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టరుగా చేవూరి హరికిరణ్‌ నియమితులయ్యారు. ఆయనకు నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ఎమ్‌డిగా అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. సెర్ప్‌ సిఇఒగా వీరపాండియన్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటర్‌గా ఎం హరినారాయణ, బిసి సంక్షేమశాఖ డైరెక్టరుగా మల్లికార్జునను నియమించారు. బిసి ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కమిషనరుగా అదనపు బాధ్యతలు కూడా అప్పజెప్పారు. సాంఘిక, సంక్షేమశాఖ కార్యదర్శిగా ప్రసన్న వెంకటేష్‌, భూ సర్వేసెటిల్‌మెంట్‌ డైరెక్టరుగా శ్రీకేష్‌ బాలాజీరావు, సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ ఎమ్‌డిగా గిరీషా, ఎపి మార్క్‌ఫెడ్‌ ఎమ్‌డిగా మంజీర్‌ జిలాని, ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టరుగా కృతికా శుక్లాను నియమించారు. ఎపిసిపిడిసిఎల్‌ సిఎమ్‌డిగా రవి సుభాష్‌, ఎపిఎంస్‌ఐడిసి ఎమ్‌డిగా లక్ష్మీశా, ఎన్‌టిఆర్‌ వైద్యసేవ సిఇఒగా అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ డైరెక్టరుగా ఎం వేణుగోపాల్‌రెడ్డి, ఎపి స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎమ్‌డిగా పి రాజబాబు, ఎక్సైజ్‌శాఖ ప్రొహిబిషన్‌ డైరెక్టరుగా నిషాంత్‌కుమార్‌, క్లీన్‌ కృష్ణా, గోదావరి కెనాల్‌ మిషన్‌ ఎమ్‌డిగా జెసి కిషోర్‌కుమార్‌, అగ్రికల్చర్‌ మార్కెట్‌శాఖ డైరెక్టరుగా విజయ సునీత, ఉద్యానశాఖ డైరెక్టరుగా కె శ్రీనివాసులు, సాంఘిక, సంక్షేమశాఖ డైరెక్టరుగా లావణ్య వేణి, ఎపిఐఐసి ఎమ్‌డిగా అభిషిక్త్‌ కిషోర్‌, ఎపి టిడిసి ఎమ్‌డిగానూ అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. సెకండరీ హెల్త్‌ డైరెక్టరుగా ఎ.సిరి, ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనరుగా రామసుందర్‌రెడ్డి, ఎపి ట్రాన్స్‌కో జాయింట్‌ ఎమ్‌డిగా కీర్తి చేకూరి, స్కిల్‌ డెవలప్‌మెంటు కార్పొరేషన్‌ ఎమ్‌డిగా గణేష్‌కుమార్‌ను నియమించారు. ఆయనకు టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టరుగా అదనపు బాధ్యతలు కేటాయించారు. విశాఖ మున్సిపల్‌ కమిషనరుగా సంపత్‌కుమార్‌, గుంటూరు మున్సిపల్‌ కమిషనరుగా దినేష్‌కుమార్‌, విజయవాడ మున్సిపల్‌ కమిషనరుగా ధ్యానచంద్ర, తిరుపతి మున్సిపల్‌ కమిషనరుగా నారపురెడ్డి మౌర్య, కడప మున్సిపల్‌ కమిషనరుగా ఎన్‌ తేజ్‌ భరత్‌, రాజమండ్రి మున్సిపల్‌ కమిషనరుగా కేతన్‌ గార్గ్‌, పల్నాడు జిల్లా జెసిగా సూరజ్‌ ధనుంజరు, గుంటూరు జెసిగా అమిలినేని భార్గవతేజ, తూర్పుగోదావరి జిల్లా జెసిగా హిమాన్షు కోహ్లి, అంబేద్కర్‌ కోనసీమ జిల్లా జెసిగా నిశాంతి, కాకినాడ జిల్లా జెసిగా గోవిందరావు నియమితులయ్యారు. పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంటుశాఖ డైరెక్టరుగా విఆర్‌కె తేజ మైలవరపును నియమించారు.

➡️