భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీ.. కమిషనర్‌ ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో భారీగా బదిలీలు జరిగాయి. హైదరాబాద్‌ పరిధిలో 63 మంది, సైబరాబాద్‌ పరిధిలో 41 మంది బదిలీ అయ్యారు. మొత్తం 104 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేశారు. మరోవైపు సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 41 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ కమిషనర్‌ అవినాష్‌ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.

నగరంలో 71మంది ఎస్‌ఐలు, ఏడుగురు ఇన్‌స్పెక్టర్లు బదిలీ…

ఇక తాజాగా.. నగరంలో 71 మంది ఎస్‌ఐలు, ఏడుగురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన సిబ్బంది వెంటనే విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చాదర్‌ ఘాట్‌ ఎస్‌ హెచ్‌ ఓ వై.ప్రక్షా రెడ్డిని మల్టీజోన్‌ 2 కి, మారేడుపల్లి ఎస్‌ హెచ్‌ ఓ డి.శ్రీనివాసరావును ఎస్‌ బీకి అటాచ్‌ చేశారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో చాలా కాలంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎట్టకేలకు వేటు పడింది.

ముగ్గురు ఇన్‌స్పెక్టర్ల  లొంగుబాటు…

విధి నిర్వహణలో నిర్లక్ష్యం, భూవివాదాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు అధికారుల ఎదుట లంగిపోయారు. సైబరాబాద్‌ పరిధిలో ఒకేసారి 16 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ అవినాష్‌ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో చాలా మంది కీలకమైన పోలీస్‌ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలుగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో మరో 10 మంది ఇన్‌స్పెక్టర్లను తొలగించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. సిఫార్సులు, ఉల్లంఘనలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించడంతో ఇన్విజిలేటర్లు బదిలీ అయిన స్టేషన్లకు వెళ్లి బాధ్యతలు చేపడుతున్నారు.

➡️