వాడవాడలా ఘనంగా ‘మే’ డే వేడుకలు

May 1,2024 13:43 #Celebrations, #May Day

ప్రజాశక్తి -యంత్రాంగం : మేడే సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యాలయం వద్ద సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు జండా ఎగరవేశారు.ఈ కార్యక్రమంలో అన్ని ట్రేడ్‌ యూనియన్‌ వర్గాల కార్మికులు పాల్గొన్నారు

మేడే స్ఫూర్తితో కార్మిక హక్కులను కాపాడుకోవాలి
-ప్రజాశక్తి బుక్స్‌హౌస్‌ ఎడిటర్‌ ఎం.వి.ఎస్‌.శర్మ పిలుపు
ప్రజాశక్తి, ఎంవిపి కాలనీ :ప్రపంచ కార్మికదినం మేడే స్ఫూర్తితో కార్మిక హక్కులను రక్షించుకోవాలని, అందుకు మే 13న జరుగుతున్న ఎన్నికల్లో కార్మికవర్గ నాయకులను గెలిపించుకోవాలని ప్రజాశక్తి బుక్స్‌హౌస్‌ ఎడిటర్‌ ఎం.వి.ఎస్‌.శర్మ పిలుపునిచ్చారు. మద్దిలపాలెం సిపిఎం జిల్లా కార్యలయం వద్ద మేడే జెండావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రాయూనివర్శిటీ సీనియర్‌ నాయకులు పీతల అప్పారావు, ముఠా నాయకులు సూరిబాబు, శివాజీపార్కు యూనియన్‌ నాయకులు లక్ష్మి, ఎం.వి.ఎస్‌.శర్మ, ఎస్‌.సుధాకర్‌లు జెండావిష్కరణ చేసారు. అనంతరం శర్మ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కార్మికవర్గం పండుగ మేడే విజయవంతంగా జరుగుతుందన్నారు. కార్మికరాజ్యం వచ్చినప్పుడే కార్మికులకు పూర్తి హక్కులను రక్షించుకోలగుతామని, పటిష్టంగా అమలు జరుగుతాయన్నారు. ప్రస్తుతం నరేంద్రమోడీ ప్రభుత్వం ఇప్పటికే కార్మికులకు ద్రోహం చేసే విధంగా కార్మికచట్టాలన్నీ యజమానులకు అనుకూలంగా మార్చివేసిందన్నారు. దేశంలో ఉండే ప్రభుత్వరంగ సంస్థలను సైతం అంబానీ, అధానీ, జిందాల్‌ వంటి కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతుందన్నారు. రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తుందన్నారు. ఇటువంటి కార్మిక వ్యతిరేక ప్రభుత్వానికి రాష్ట్రంలో టిడిపి, వైసిపి, జనసేన పార్టీలు దాసోహమవుతున్నాయన్నారు. ఈ నేపధ్యంలో కార్మిక లేబర్‌కోడ్స్‌ రద్దుచేస్తామని, స్టీల్‌ప్లాంట్‌, ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటీకరించమని, కనీసవేతనాలు అమలు చేస్తామని చెబుతున్న సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌, ఆప్‌ పార్టీలతో కూడిన ఇండియా కూటమిని గెలిపించుకోవాల్సిన అవసరాన్ని గుర్తుజేసారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మద్దిలపాలెం జోన్‌ కార్యదర్శి వి.కఅష్ణారావు, నాయకులు అనపర్తి అప్పారావు, పి.వెంకటరావు, కె.కుమారి, త్రినాదరావు, జి.వి.రమణ, ప్రదీప్‌, పి.వి.రమణ, చంటి తదితరులు పాల్గొన్నారు.

 

తిరుపతి :మే డే సందర్భంగా బుధవారం నాడు పార్వతీపురం పట్టణంలో మున్సిపల్‌ కార్యాలయం ముందు పారిశుధ్య కార్మికులతో కలిసి సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది. అనంతరము రైస్‌ మిల్లర్‌ యూనియన్‌ ఆర్టిసి కలసి యూనియన్‌ ఆటో డ్రైవర్ల యూనియన్‌ తోపుడు బల్లు కార్మిక సంఘాల వద్ద సిఐటియు జెండా ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి వేణు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అన్ని ట్రేడ్‌ యూనియన్‌ వర్గాల కార్మికులు పాల్గొన్నారు

కర్నూల్‌లో 138 మే డే వేడుకలు
కర్నూల్‌ : మే డే సందర్భంగా బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి మోహన్‌ ,మండల అధ్యక్షులు రంగన్న, ఖాజా, కార్యదర్శులు సుందరరాజు, జైలు, కార్మికులు, సభ్యులు, ఆటో, హమాలీ కార్మికులు పాల్గొన్నారు.

నరసరావుపేట లోని స్థానిక మల్లమ్మ సెంటర్ వద్ద భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం పురస్కరించుకుని కార్మికులు జెండా ఎగరవేసారు.కార్మికులు, సభ్యులు, ఆటో, హమాలీ కార్మికులు పాల్గొన్నారు.

గుంటూరు :ప్రపంచ కార్మికుల దినోత్సవన్ని పురస్కరించుకొని తాడికొండ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో మే డే సందర్భంగా జెండా ఎగురవేసిన రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజరు కుమార్‌,కార్యక్రమంలో  మండల కార్యదర్శి పూర్ణ చంద్రరావు, చింతల భాస్కరరావు,రైతులు, కార్మికులు,పాల్గొన్నారు.

ప్రజాశక్తి- ఎస్‌ ఆర్‌ పురం : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్‌ఆర్‌ పురం మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీ 49 కొత్త పల్లి మిట్ట వాణిజ్య కూడలి నందు అంబేద్కర్‌ ఆటో యూనియన్‌, తిరుపతి రోడ్డు లో మహాత్మా గాంధీ ఆటో యూనియన్‌, మండలం కేంద్రమైన ఎస్‌ఆర్‌ పురం సి ఐ టి యు యూనియన్‌ కార్మికులు బుధవారం మే డే సందర్భంగా పూజలు నిర్వహించి పండ్లు, స్వీట్లు, మిఠాయిలు పంచి పండుగ వాతావరణం లో మే డే ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర వేణు చారి ఎలుమలై తవముని చెంగమ నాయుడు బాబు కిరణ్‌ గణేష్‌ శంకర్‌ మోహన్‌ బాలరాజ్‌ జగన్నాథం లోకేష్‌ పుష్పరాజ్‌ సురేష్‌ నరసింహులు రవి సుధా మురుగన్‌ కార్మిక నాయకులు కార్యకర్తలు యూనియన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ఒంగోలు :  ప్రకాశం జిల్లాలోని  సుందరయ్య భవనం వద్ద   మేడే సందర్భంగా జెండా ఆవిష్కరించారు.

ప్రజాశక్తి – చీరాల : కార్మికుల దినోత్సవం సందర్భంగా స్థానిక ఐటిసి వద్ద, పట్టణంలోని మున్సిపల్‌, కార్యాలయం, ఎల్‌ఐసి, పలు చోట్ల సిఐటియు నాయకులు జెండా ఆవిష్కరించారు.

ఘనంగా మే డే వేడుకలు
ప్రజాశక్తి -అజిత్‌ సింగ్‌ నగర్‌ :విజయవాడ సెంట్రల్‌ సిటీ సింగనగర్‌ కృష్ణ హోటల్‌ సెంటర్‌ 61, 62 డివిజన్లలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సెంట్రల్‌ సిటీ సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు మాట్లాడుతూ కార్మికులకు, కర్షకులకు, చిరు వ్యాపారులకు, ముఠా వర్కర్స్‌ కు అనుబంధ సంస్థలకు మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. టిడిపి- జనసేన ప్రకటించిన మేనిఫెస్టో నమ్మశక్యంగా లేదని బిజెపి మేనిఫెస్టో ప్రకటనకు దూరంగా ఉండటం వలన టిడిపి జనసేన ప్రకటించిన పథకాలు అమలు కావు అన్నారు. బిజెపికి మద్దతు పలుకుతున్న టిడిపి జనసేన వైసిపి పార్టీలను ఓడించి బుద్ధి చెప్పాలి అన్నారు. విజయవాడ సెంట్రల్‌ సిటీలో పోటీ చేయుచున్న ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థి సీపీఎం పార్టీ చిగురుపాటి బాబు రావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్‌ సిటీ కార్యదర్శి బి రమణారావు అధ్యక్షులు కే దుర్గారావు డివిజన్‌ ఇన్చార్జిలు సిహెచ్‌ శ్రీను నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

ఘనంగా మే డే వేడుకలు
ప్రజాశక్తి -రొద్దం : మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో, అంగన్వాడి కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు హమాలీలు మే డే సందర్భంగా జెండా ఆవిష్కరించారు. అనంతరం మే డే ప్రత్యేకతను సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌, వ్యవసాయ సంఘం నాయకులు, ఫక్రుద్దీన్‌ క్షుణ్ణంగా వివరించి తెలిపారు.ఈ సందర్భంగా మే డే సందర్భంగా ప్రజాశక్తి మే డే స్పెషల్‌ ను, సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌, అంగన్వాడి కార్యకర్తలు, ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రమేష్‌, ఫక్రుద్దీన్‌, అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కార్మికవర్గ ద్రోహి మోడీని ఒడించండి :సి ఐ టి యు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మేడే స్ఫూర్తితో కార్మిక వర్గ ద్రోహి మోడీ ప్రభుత్వాన్ని,అందుకు సహకరిస్తున్న రాష్ట్రంలో ఉన్న పార్టీలను జరుగుతున్న ఎన్నికల్లో ఓడించాలని సి ఐ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్‌,ఉపాధ్యక్షులు రెడ్డి శంకరరావు, కార్యదర్శి యు ఎస్‌ రవికుమార్‌, ఏ.జగన్మోహన్‌,బి.రమణ లు పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా బుధవారం నగరంలో కోట జంక్షన్‌ వద్ద సి ఐ టి యు జెండాను సీనియర్‌ నాయకులు రెడ్డి శంకరరావు ఆవిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను,చట్టాలను నేడు కేంద్రంలో అధికారం లో ఉన్న మోడీ ప్రభుత్వం కలరస్తుందన్నారు.కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి కార్మికులకు కనీస వేతనాలు అమలు కాకుండా, 8 గంటలు పని దినం అమలు జరగకుండా కార్మిక సంఘాలు పెట్టకుండా కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తుందన్నారు. అన్ని రకాల నిత్యావసర ధరలు పెంచి పేదలు,సామాన్యులు బతకలేని పాలన సాగిస్తున్నారాన్నారు. దేశానికి అన్నంపేట్టే రైతులను సైతం రోడ్డున పడేసే చట్టాలు తీసుకొస్తుందన్నారు. దేశాన్ని దోపిడీ దార్లుకు, పెట్టుబడి దారులకు దోచుకోవడానికి అనుగుణంగా పాలన సాగిస్తుందన్నారు.ఏదైతే పని గంటలు కోసం,కార్మిక.హక్కులు కోసం పోరాటం చేసి సాధించుకున్న ఫలితంగా ఏర్పడిన మేడే స్ఫూర్తితో హక్కులు సాధన కోసం,చట్టాలను కాపాడుకోవడం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్మిక హక్కులను , చట్టాలను కాలరాస్తున్న కేంద్రంలో మోడీ నీ,రాష్ట్రంలో మోడీకి మద్దతు ఇస్తున్న పార్టీలను ఎన్నికల్లో ఓడించాలని,కార్మిక హక్కులు కోసం అండగా నిలబడే ఇండియా కూటమి అభ్యర్ధులను గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు.కార్యక్రమంలో కార్మికులు,మెడికల్‌ రిప్స్‌ , ఆటో కార్మికులు పాల్గొన్నారు.

 


ప్రజాశక్తి – ఆలమూరు :మండల కేంద్రంలో తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట కార్మిక, కర్షక మేడే దినోత్సవం పురస్కరించుకుని సిఐటియు, యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో బుధవారం ఆయా జెండాలను సీనియర్‌ నాయకులు ఆవిష్కరించి, అసువులు బాసిన వారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉద్యమ నినాదంతో ప్రపంచ కార్మికులారా ఒకే తాటిపై పయనిస్తూ మన హక్కుల కోసం పోరాడిన వీరులెందరో ఉన్నారు. ఆనాడు చికాగో నగరంలో ప్రారంభమైన ఉద్యమ పోరాటం నేడు సుస్థిర ఎర్ర జెండాగా మారి పోరాటాలకు స్ఫూర్తిగా నింపిందన్నారు. అలాగే మనకు అవసరమైన కార్మిక చట్టాలను తెచ్చి పెట్టిందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యమాలు చేపట్టి మన హక్కులు సాధించుకుందామని వారంతా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్‌ మండల కార్యదర్శి కె.వి.ఆర్‌.బాపూజీ, యూటీఎఫ్‌ నాయకులు అద్దరి శ్రీనివాసరావు, వై.వి.వి.రమణ, పి.వి.వి.జి.ఎస్‌.ఎన్‌.మూర్తి, జె.మనోజ్‌, భాస్కర్‌ రెడ్డి, ఈదర రమేష్‌, నాగేశ్వరరావు, శ్యామల, అంగన్వాడీల నాయకులు యు.సుశీల, ధనలక్ష్మి, వెంకటలక్ష్మి, మెర్సి ప్లోరెన్స్‌, ఎస్టీయు నాయకులు, మిడ్డే మీల్స్‌, ఆశా కార్యకర్తలు, వివిధ ఆటో సంఘాల యూనియన్ల నాయకులు పాల్గొన్నారు.

మొగల్తూరులో ప్రదర్శన చేస్తున్న ఉద్యోగ కార్మిక సంఘ నాయకులు.

 

విశాఖ :స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద మేడే సంబరాలు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ నరసింహ రావు గారు అయోధ్యరాం ఎం రామారావు వై టి దాస్ బి గంగారావు

నెల్లూరు: బాలాజీ నగర్‌ 15వ డివిజన్లో మే డే సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మోహన్‌ రావు గారు, రాష్ట్ర ప్రజానాట్యమండలి కార్యదర్శి అనిల్‌ గారు పాల్గొన్నారు, జెండా ఆవిష్కరణ అనంతరం మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది.

చల్లపల్లిలో ఘనంగా మే డే వేడుకలు
ప్రజాశక్తి -చల్లపల్లి : కార్మికుల రక్తంతో తడిసినదే ఎర్రజెండా అని, కార్మికుల ప్రాణాలు ఫలితంగానే మేడే ఏర్పడిందని సిపిఎం సీనియర్‌ నాయకులు వాకా రామచంద్ర అన్నారు. సిఐటియు పిలుపు ఆటో కార్మికుల ఆధ్వర్యంలో మే డే వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గన్న సీనియర్‌ నాయకుడు వాకా రామచంద్రరావు, సిఐటియు మండల కార్యదర్శి మహమ్మద్‌ కరీముల్లా వసంతరావు కార్మిక సమస్యలపై మాట్లాడారు. పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకునేందుకు కఅషి చేస్తున్న శ్రామిక ప్రజలకు సిఐటియు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. స్థానిక బస్టాండ్‌ సమీపంలోని కఅష్ణా జిల్లా ఆటో వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులులు తోట శివకఅష్ణ,, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ పెదకళ్ళపల్లి పాయింట్‌ వద్ద నలుగుర్తి కఅష్ణ ప్రసాద్‌ (యోబు ) వ ద్ద సిఐటియు మండల కార్యదర్శి మహమ్మద్‌ కరీముల్లా, జై దుర్గ భవాని ఆటో యూనియన్‌ పామూరు పాయింట్‌ వద్ద ఎం. వాసుదేవరావు, చల్లపల్లి టాక్సీ ఓనర్స్‌, వర్కర్స్‌ మాజీ అధ్యక్షులు నర్ర సురేంద్ర స్వాతంత్ర ఆటో వర్కర్స్‌ యూనియన్‌ బందర్‌ పాయింట్‌ వద్ద గౌరవ అధ్యక్షులు వెనిగళ్ళ వసంతరావు, శ్రీ వరసిద్ధి వినాయక ఆటో వర్కర్స్‌ యూనియన్‌ నడకుదురు పాయింట్‌ వద్ద యూనియన్‌ ఉపాధ్యక్షులు కొడాలి చంటి, ది కఅష్ణా జిల్లా బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ వద్ద యూనియన్‌ గౌరవ అధ్యక్షులు క్రియేటివ్‌ బందలపాటి వెంకటేశ్వరరావు, స్థానిక సిఐటియు కార్యాలయం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ వద్ద సిఐటియు మండల అధ్యక్షురాలు సిహెచ్‌ గంగాభవాని సిఐటియు పతాకాన్ని ఆవిష్కరించారు.

➡️