ప్రజాశక్తి-మంగళగిరి : అంతర్జాతీయ కార్మికుల దినోత్సవ సందర్భంగా నులకపేటలోని ప్రజాశక్తి దినపత్రిక ప్రింటింగ్ ప్రెస్ నందు మే డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కార్మికులందరూ పాల్గొని అమెరికా చికాగో నగరంలో హే మార్కెట్ వద్ద సమ్మె చేస్తుంటే యాజమాన్యం గూండాలు చేసిన అరాచకాలకు ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు నివాళులు అర్పించారు. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మే డే సందర్భంగా సంస్థలో నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి సిజిఎమ్ అచ్యుతరావు, ప్రజాశక్తి ఎడిటర్ తులసీదాస్, ఆర్ కృష్ణయ్య, పిడిపిపి మేనేజర్ సురేష్ రాజు, తదితరులు పాల్గొని ప్రసంగించారు.
