మేడే పతాకావిష్కరణకు అనుమతి

Apr 26,2024 08:22 #cpm, #prakatana

సిపిఎం వినతికి స్పందించిన ఎన్నికల సంఘం
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఎన్నికల ప్రచారం, ఎన్నికల ఉపన్యాసాలు లేకుండా మేడే రోజు పార్టీ ఆఫీసుల వద్ద, ఇతర చోట్ల జెండాలు ఆవిష్కరించడానికి, కార్మికులు ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోడానికి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. అయితే, వాటికి ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించింది. పతాకావిష్కరణలకు అనుమతి ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జె.జయరాం సిఇఓకు వినతిపత్రం సమర్పించిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన సిఇఓ అనుమతి ఇస్తూ లేఖను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుకు పంపించారు. అలాగే జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలు, ఎన్నికల అధికారులకూ పంపించారు.

➡️