డెంగీ నివారణకు చర్యలు

May 16,2024 22:31 #ap government, #dengue
  •  వైద్యారోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎమ్‌టి కృష్ణబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో డెంగీ నివారణకు వైద్యారోగ్యశాఖ పటిష్ట చర్యలు తీసుకుంటోందని వైద్యారోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎమ్‌టి కృష్ణబాబు తెలిపారు. జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా గురువారం మంగళగిరిలో ఆయన పోస్టరును ఆవిష్కరించారు. అనుమానాస్పద డెంగీ జ్వరాల రక్త నమూనాలను సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 54 డెంగీ నిర్ధారణ కేంద్రాల్లో పరీక్షించి తగు చికిత్స, నివారణ చర్యలు తీసుకోవాలని కృష్ణబాబు అన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వైద్యారోగ్యశాఖ కమిషనరు ఎస్‌ వెంకటేశ్వర్‌ మాట్లాడుతూ.. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని దోమల ద్వారా వచ్చే వ్యాధులపై ప్రజలకు వివిధ మాధ్యమాల ద్వారా పూర్తి అవగాహన కల్పించాలన్నారు.

➡️