విద్యాశాఖ మంతి లోకేష్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి మెగా డిఎస్‌సి ద్వారా 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఐటి, మానవ వనరులశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శుక్రవారం శాసనసభ ప్రశోుత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశుకు ఆయన సమాధానం చెప్పారు. 1994 నుంచి పడిన కేసులను పరిశీలించి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా డిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నామన్నారు. డిఎస్‌సికి ఎంత మేరకు వయో పరిమితి మినహాయింపు ఇచ్చేది త్వరలోనే తెలియజేస్తామని, జిఓ 117కు త్వరలోనే ప్రత్యామాుయం తీసుకొస్తామని చెప్పారు. దీనిలో భాగంగానే ఉపాధ్యాయ సంఘాలతో అనేక పర్యాయాలు చర్చించినట్లు తెలిపారు. భీమిలి నియోజకవర్గం పద్మనాభ మండలం మధురవాడ – తగరపువలస ప్రాంతంలో డిగ్రీ, జూనియర్ కళాశాల ఏర్పాటుకు అవకాశం లేదని సభ్యులు అడిగిన మరో ప్రశుకు సమాధానం ఇచ్చారు.
గిరిజన నివాస ప్రాంతాల అనుసంధానం : మంత్రి గుమ్మడి సంధ్యారాణి
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో గిరిజన ప్రాంత జనావాసాల అనుసంధానం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని మహిళా, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో 2,162 అనుసంధానం లేని జనావాసాలను గుర్తించామన్నారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్‌శాఖ 100కుపైగా జనాభా కలిగివును 499 పివిటిజి జనావాసాలను అనుసంధానం చేసేందుకు కృషి చేస్తోందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఫీడర్ అంబులెన్స్‌ల సదుపాయాన్ని పునరుద్ధరిస్తామని, జనన నిరీక్షణ సదనాలను సమకూర్చుతామని చెప్పారు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వ్యయం రూ.17,050.20 కోట్లు
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణానికి అంచనా వ్యయం రూ.17,50.20 కోట్లుగా ఉందని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎనిమిది లక్షల ఎకరాలకుగోదావరిలో వచ్చే వరద నీరు 63.20 టిఎంసిలు మళ్లించే అవకాశం ఉందనిచెప్పారు.
కార్మిక బీమా పరిధిలోకి 25 లక్షల మంది : మంత్రి వాసంశెట్టి సుభాష్
హోటల్స్, ఆక్వా సంస్థలు, ఇతర పరిశ్రమల్లో ఎంతమంది కార్మికులు పనిచేసేది నిర్ధారించేందుకు కార్మిశాఖ రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుందని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో పది మందికి పైగా పనిచేస్తున్న సంస్థలను కార్మికశాఖ పరిధిలోకి తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్రంలో 14 లక్షల 55 వేల మంది కార్మికులు కార్మిక బీమా పరిధిలో ఉన్నారని, రెండు సంవత్సరాల్లో 25 లక్షల మందిని బీమా పరిధిలోకి తీసుకొస్తామని తెలిపారు. 20 వేల మందికిపైగా కార్మిక బీమా సభ్యులును ప్రాంతాల్లోనే 30 పడకల ఇఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటుకు అవకాశం ఉంటుందని సభ్యులు అడిగిన ప్రశుకు సమాధానంగా చెప్పారు.