తెలుగు రాష్ట్రాల్లో వాహనాలన్నీ బిజీ – తెలంగాణలో మెట్రో రద్దీ

అమరావతి : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో … తెలుగు రాష్ట్రాల్లో బస్సులు, రైళ్లు, ఆటోలు ఒకటేమిటి వాహనాలన్నీ కిక్కిరిసిపోయాయి. హైవేలపై ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడింది. ఇప్పుడు ఓటేసిన ప్రజలంతా తిరిగి వారివారి ఊళ్ల బాటపట్టారు. దీంతో మళ్లీ వాహనాలన్నీ బిజీ అయిపోయాయి. మరోవైపు … హైదరాబాద్‌ మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రధానంగా ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌ వైపు రైళ్లలో ఎక్కువ మంది ప్రయాణిస్తుండటంతో రద్దీ పెరిగింది. సాధారణంగా ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు మెట్రో సేవలు ప్రారంభమవుతాయి. కానీ, మంగళవారం ఉదయం 5 గంటల 30 నిముషాల నుంచే మెట్రో రాకపోకలు మొదలయ్యాయి. రద్దీ దఅష్ట్యా మరిన్ని ట్రిప్పులు నడిపే అవకాశముంది.

➡️