గనుల శాఖ, ఏపీఎండీసీ కార్యాలయాలు సీజ్‌

Jun 9,2024 10:33 #APMDC, #Mines Department, #siege

అమరావతి: విజయవాడలోని గనుల శాఖ, ఖనిజాభిద్ధి సంస్థల కార్యాలయాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎపిఎమ్‌డిసి ఇన్‌ఛార్జి ఎండి వెంకటరెడ్డి బదిలీ కాగానే ఆయా కార్యాలయాలకు తాళాలు వేశారు. లీజుల కేటాయింపుల్లో అక్రమాలు, ఇసుక విక్రయాల్లో దోపిడీ, బీచ్‌ శాండ్‌ అంశాల్లో పలువురికి వెంకటరెడ్డి లబ్ధి చేకూర్చారనే ఆరోపణలున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా దస్త్రాలు, హార్డ్‌ కాపీలు బయటకు వెళ్లనీకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

➡️