ప్రకాశం : ఢిల్లీలో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పర్యటన రెండవ రోజు శనివారం కొనసాగుతోంది. ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదరు యోజన పథకంపై నిర్వహించిన సమన్వయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ప్రస్తుతం పీఎం ఆదర్శ గ్రామ్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.20 లక్షలను రూ.50 లక్షలకు పెంచాలని, పీఎం యోజన పథకం కింద మంజూరైన సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు త్వరితగతిన నిధులు విడుదల చేయాలని మంత్రి డోలా బాల వీరంజనేయులు కోరారు.
