ఛార్జీలు పెంచినందుకా జగన్‌కు సన్మానం : మంత్రి గొట్టిపాటి రవి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొమ్మిదిసార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచినందుకు సన్మానించాలా? అని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రశ్నించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసినందుకు, అవినీతి అక్రమాలతో రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లినందుకు శాలువా కప్పాలా? అంటూ శనివారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ లేని విధంగా గత ఐదేళ్ల వైసిపి ప్రభుత్వ హయాంలో తొమ్మిది సార్లు విద్యుత్‌ ఛార్జీలను పెంచి సామాన్యులపై మోయలేని భారాన్ని వేసిన ఘనత జగన్‌కు దక్కుతుందన్నారు.

➡️