పశ్చిమ గోదావరి : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గురువారం ఆక్వా రైతులతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులు నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేయాలని మంత్రిని కోరారు. వారు కోరినట్టుగానే నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తామని రైతులకు మంత్రి హామీ ఇచ్చారు. ఇక, విద్యుత్ లోడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. విద్యుత్ సరఫరా అవసరానికి తగినట్లుగా కొత్త సబ్ స్టేషన్లను గుర్తించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ఆక్వా రైతుల సమస్యలపై సరైన నిర్ణయం తీసుకుంటామని సంబంధిత రైతులకు భరోసా ఇచ్చారు.