అడోబ్ సీఈవోతో మంత్రి లోకేష్ భేటీ

Oct 29,2024 16:01 #adobe CEO, #Lokesh

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రానికి పెట్టుబడుల కోసం రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన కొనసాగుతోంది. తాజాగా, శాన్ ఫ్రాన్సిస్కోలో అడోబ్ సీఈవో శంతను నారాయణ్ తో లోకేష్  భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడులకు అన్నివిధాల అనుకూలమైన ప్రాంతమని,  పెట్టుబడులు పెట్టాల్సిందిగా లోకేష్ ఆయనను కోరారు.  డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌ల ద్వారా సృజనాత్మక, వ్యాపార సాధనాల్లో అడోబ్ సేవలు ప్రశంసనీయం. ఏపీలో ఈ-గవర్నెన్స్‌ని సమగ్రపర్చడం, గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చడానికి సహకారం కావాలని లోకేష్ శంతను కోరారు.

ఇక, ఏపీలో అడోబ్ ఆర్ అండ్ డి కేంద్రాన్ని ఏర్పాటు చేయండని శంతను నారాయణ్ ను లోకేష్ కోరారు.  ప్రభుత్వ సేవలు, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌ల్లో అడోబ్ ఏఐ ఆధారిత సేవలు, సృజనాత్మకత, డిజిటల్ అనుభవం ఆంధ్రప్రదేశ్ కు ఉపయోగపడతాయి. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, స్టార్టప్‌లకు అడోబ్  సృజనాత్మక సాధనాలు ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధికి దోహదపడతాయి, ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని లోకేష్ కోరారు. అయితే, మంత్రి నారా లోకేష్‌ చేసిన ప్రతిపాదనలపై శంతన్ నారాయణ్ స్పందిస్తూ… కంపెనీలోని సహచరులతో చర్చించి ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

➡️