ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో టీడీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘అన్నా..అన్నా.. అని పిలిచేవాడివి ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసేవాడివి అంటూ మంత్రి లోకేష్ భావోద్వేగానికి లోనయ్యారు. నీకు ఆపద వస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా? అంటూ లోకేష్ వెల్లడించారు. దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు ‘ఐ మిస్ యూ’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. నువ్వు ఆత్మహత్య చేసుకున్న సంగతి సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని నిన్ను కాపాడుకునేందుకు చేయని ప్రయత్నం లేదని తెలిపారు. నీ కుటుంబానికి ఓ అన్నగా నేనున్నాను.. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా కష్టసుఖాలను పంచుకుందామని తెలిపారు. బతికే ఉందాం ఇంకో నలుగురిని బతికిద్దాం’ అంటూ కార్యకర్త ఆత్మహత్య పై లోకేష్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ క్రమంలో మంత్రి లోకేష్ చేసిన భావోద్వేగమైన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
