10 టన్నుల రేషన్ బియ్యం గుర్తింపు
ప్రజాశక్తి- కంచికచర్ల : ఎన్‌టిఆర్ జిల్లా కంచిక చర్ల మండలం పరిటాల సమీపంలోని శ్రీ లక్ష్మి రైస్, సాయినాథ్ ఆగ్రో లిమిటెడ్ మిల్లును రాష్ట్ర పౌరసర ఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళ వారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేదలకు రాష్ట్ర ప్రభుత్వం కిలో రూపాయికి అందజేస్తున్న రేషన్ బియ్యా న్ని సేకరించి పాలిష్ చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారన్న సమాచారంతో రైస్ మిల్లులోని ప్రతి విభాగాన్నీ మంత్రి మనోహర్ పరిశీలించారు. మిల్లులో 103 టన్నుల బియ్యం ఉండగా, వీటిలో సుమారు పది టన్నులు రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. మిల్లుకు సీలు వేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.
