కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన మంత్రి రామ్‌ప్రసాద్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కడప జిల్లాలోని రాజంపేట – రాయచోటి – కదిరి రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్చి అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని రాష్ట్ర మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌ కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో బుధవారం కలిసి పలు అంశాలపై చర్చించారు. రాయచోటిలో సెంట్రల్‌ రోడ్‌ విస్తరణకు నిధులు కోరారు. నేషనల్‌ హైవేస్‌ లాజిస్టిక్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టును ఆమోదించి, పనులు త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కడప – రాయచోటి 4 లైన్ల రహదారిని మంజూరు చేయాలని కోరారు. అలాగే ఈ రహదారిలో 4 కిలోమీటర్ల టన్నెల్‌ ఏర్పాటుకు అటవీశాఖ అనుమతులు వచ్చిన వెంటనే పనులు చేపట్టాలన్నారు.

➡️