ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ : రాష్ట్రంలోని అన్ని బిసి సంక్షేమ విద్యాలయాల్లో నాణ్యమైన భోజనం, విద్యను అందించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఎంపి అంబికా లక్ష్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వప్రసాద్ ప్రసాద్, ఎంఎస్.రాజు, బండారు శ్రావణిలతో కలిసి అనంతపురం ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. 2014-19లోని బిసి రెసిడెన్షియల్ హాస్టళ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గత ఐదేళ్ల కాలంలో కేవలం రెండు బిసి రెసిడెన్షియనల్ పాఠశాలలను మాత్రమే తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం బిసి, ఎస్‌సి, ఎస్‌టి రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాల్లో నాణ్యమైన విద్య, భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చేనేతల అభివృద్ధి కోసం ప్రతి సోమవారం చేనేత దుస్తులు ధరించాలని ప్రజలను కోరారు.
