చెత్త పన్ను రద్దుపై మంత్రి సవిత హర్షం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లు సిఎం చంద్రబాబు ప్రకటించడంపై బిసి సంక్షేమశాఖ మంత్రి ఎస్‌ సవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. దేశం యావత్తూ అవాక్కయ్యేలా చెత్త పన్ను నిర్ణయం తీసుకున్న జగన్‌ ప్రభుత్వం.. అన్ని రకాల పన్నులు, ఛార్జీలు పెంచి ఐదేళ్ల పాలనలో ప్రజలను పీల్చిపిప్పి చేశారని ఆరోపించారు. చివరికి పెన్షన్‌ చెల్లింపుల్లోనూ చెత్త పన్ను మినహాయించుకుని లబ్ధిదారులకు నగదు ఇచ్చే వారన్నారు. చెత్త పన్ను రద్దుతో ప్రజలపై ముఖ్యంగా పేదలపై భారం తగ్గుతుందని పేర్కొన్నారు.

➡️