mla:క్షత్రియులకు మంత్రివర్గంలో చోటు కల్పించాలి

  •  ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు

ప్రజాశక్తి – కాళ్ల : క్షత్రియులకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పశ్చిమగోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు కోరారు. పెదఅమిరం గ్రామంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల వారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. క్షత్రియులను గుర్తించలేదని అనుకోవద్దని, ఇంకా సమయం ఉందని, పదవులు ఉన్నాయని తెలిపారు. చట్ట సభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు జాగ్రత్తగా పనిచేయాలని సిఎం చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. పవన్‌ కల్యాణ్‌కు గ్రామీణాభివృద్ధి శాఖ ఇస్తారని తెలుస్తోందని, ఆయన సహకారంతో గ్రామాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.
వేధింపుల ఘటనపై ఫిర్యాదు
వైసిపి హయాంలో కస్టడీలో తనపై వేధింపులకు పాల్పడ్డారని, ఈ ఘటనపై ఇప్పటికే ఫిర్యాదు చేశానని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో కారకులపై కేసు కూడా నమోదవుతుందన్నారు. ఓదార్పు యాత్ర 2.0 స్టార్ట్‌ చేస్తారేమోనని జగన్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. తమ నేతలపై టిడిపి వారు దాడి చేశారని ఢిల్లీలో విజయసాయిరెడ్డి గొడవ చేశారని, వైసిపి వారు ఎంత దుర్మార్గులో తన కంటే తెలిసిన వారెవ్వరూ లేరన్నారు.

➡️