ప్రజాశక్తి-పెద్దదోర్నాల (ప్రకాశం జిల్లా) : రాష్ట్రంలో ఎన్‌డిఎ కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే ప్రకాశం జిల్లా దోర్నాల నుంచి శ్రీశైలం వరకు పాదయాత్రగా వచ్చి మొక్కు తీర్చుకుంటానని కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ శాసనసభ్యులు అరవ శ్రీధర్ మొక్కుకున్నారు. ఈ క్రమంలో తాను అనుకున్నది జరగడంతో మంగళవారం దోర్నాల వచ్చారు. ముందుగా అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి, శ్రీశైలానికి పాదయాత్ర ప్రారంభించారు.
