ఎమ్మెల్యే సుధాకర్‌బాబుకు మాతృ వియోగం

ప్రజాశక్తి- నాదెండ్ల (పల్నాడు జిల్లా) :ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే టిజెఆర్‌ సుధాకర్‌ బాబు మాతృమూర్తి తలతోటి అన్నమ్మ (81) పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో వారి స్వగృహంలో మంగళవారం కన్నుమూశారు. అనారోగ్యంతో ఆమె మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అన్నమ్మ గతంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, చిలకలూరిపేట నియోజకవర్గ వైసిపి అభ్యర్థి కావటి మనోహర్‌ నాయుడు, డిప్యూటీ మేయర్‌ డైమండ్‌ బాబు, విడదల గోపి తూబాడు గ్రామంలోని సుధాకర్‌బాబు నివాసానికి వెళ్లి అన్నమ్మ భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుధాకర్‌బాబును ఓదార్చారు. బుధవారం తూబాడులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

➡️