హైదరాబాద్ : ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల సమస్యల పరిష్కారానికి కఅషి చేస్తానని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రవీంద్ర భారతిలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నామమాత్రపు ఫీజులతో పేద, మధ్య తరగతి విద్యార్థులకు సేవలు అందిస్తున్న ఆర్‌ఎస్‌ఎమ్‌ఎ పనితీరు అభినందనీయమన్నారు.
ప్రభుత్వ గుర్తింపు పొందిన యాజమాన్యాలు అనేకమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాయని ప్రశంసించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాలలో సైతం ప్రతిభ చాటాలని సూచించారు. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు.చదువుతో పాటు అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. కాగా, విద్యార్థుల నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి.
ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి : ఎమ్మెల్యే తలసాని
