kodi pandalu: విజేతలకు బుల్లెట్‌ బైక్‌ అందజేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు : గుడివాడలోని వేమవరం గ్రామంలో నిర్వహించిన కోడి పందేలలో విజేతలకు నిర్వహకులు బుల్లెట్‌ బైక్‌ను అందజేశారు. రూ.2 లక్షల 70 వేలు విలువగల రాయల్‌ ఎన్‌ఫిల్డ్‌ బైక్‌ను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చేతుల మీదుగా విజేతలు భాష, రెడ్డి, బాబీలకు అందజేశారు. ఇలాంటి బహుమతులు నిర్వాహకులు ఏర్పాటు చేయడంతో ఇతర ప్రాంతాల నుండి కూడా ఎక్కువ మంది కోడిపందేలపై ఆసక్తి చూపిస్తున్నారు.

➡️