పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు గడువు పెంచాలి :  ఎమ్మెల్సీ అశోక్‌బాబు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల చేర్పుల గడువును ఈ నెల 18 వరకు పొడిగించాలని టిడిపి ఎమ్మెల్సీ అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. మంగళగిరిలోని టిడిపి కార్యాలయంలో మంగళవారం వారు మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం ఓటరు నమోదుకు ఈ నెల 6 వరకు గడువు ఉందని, నమోదులో ఉదాసీనత, నిర్లిప్తత కనిపిస్తోందన్నారు. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓ రకంగా నమోదైనా, తూర్పు, పశ్చిమగోదావరి నియోజకవర్గాల్లో నమోదు నడకన సాగుతోందన్నారు.

➡️