గుంటూరు : కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎంఎల్‌సి అభ్యర్థి కెఎస్.లక్ష్మణరావు ఈనెల 10వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఫిబ్రవరి 27న జరగనున్న ఎంఎల్‌సి ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థిగా లక్ష్మణరావు పోటీ చేస్తున్నారు. గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 10వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు సభ నిర్వహించి అక్కడి నుండి భారీ ప్రదర్శనగా జిల్లా కలెక్టరేట్ కు వెళ్లి అక్కడ నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు.
