ప్రజాశక్తి – కలెక్టరేట్ (విశాఖపట్నం)
ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జిల్లా ఎన్నికల అధికారి, విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్ మంగళవారం విడుదల చేశారు. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల 13, పరిశీలన 14, ఉపసంహరణ గడువు 16 అని వెల్లడించారు. 30వ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఆగస్టు ఆరు నుంచి 30వ తేదీ వరకు అమలులో ఉంటుందని పేర్కొన్నారు.
