ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : గత వైసిపి ప్రభుత్వం పై ప్రస్తుత ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తప్పుడు ఆరోపణ చేస్తున్నారని ఎంఎల్సీ వరుదు కళ్యాణి అన్నారు. సిరిపురం లోని ఆమె క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు క్షేమించరాని పాపం చేశారు. తిరుమల లడ్డుపై మచ్చ వేశారని అన్నరు. ఇప్పటికే తమ నాయకుడు ఈ వివాదంపై ప్రధానికి లేఖ రాశారని, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం కూడా చేసారని అన్నారు. గతంలో ఎంతమంది నుండి డిక్లరేషన్ తీసుకున్నారో ప్రభుత్వం వివరాలు తెలియజేయాలని డిమాండ్ చేసారు. జగన్ తిరుపతి వస్తున్నారని తెలిసి నోటీసులు అంటించి ఆయన రావట్లేదు అనగానే వెంటనే తీసేసారని అన్నరు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉన్నడువల్లె గతంలో జగన్ కుటుంబం స్వామి వారి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం వచ్చిందని అన్నారు. రాష్ట్ర హోం మంత్రి అనిత అబద్ధాలు చెప్పడంలో వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడుని మించిపోయిందని తిరుమలలో టీటీడీ రూల్స్ నడుస్తున్నాయా ? టిడిపి రూల్స్ నడుస్తున్నాయా? తమకు అర్ధం కావటం లేదని అన్నరు. హోం మంత్రి అనిత నోరు అదుపులో పెట్టుకోవాలని , జగన్ సతీమణి భారతి పై మీద తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.