తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రముఖ నటుడు మోహన్ బాబు దిగ్భ్రాంతి వ్యక్తి చేశారు. ఈ ఘటన తన హృదయాన్ని కలిచివేసిందని మోహన్ బాబు అన్నారు.
ఇలా జరగడం దురదృష్టం
ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం తీసుకునే జాగ్రత్తలు, సదుపాయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అయినా ఇలా జరగడం దురదృష్టకరం. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని.. మరణించిన వారి కుటుంబాలకు ఆ వైకుంఠవాసుడు మనోధైర్యాన్ని కల్పించాలని ప్రార్థిస్తున్నాను అంటూ ఎక్స్ (ట్విటర్)లో ట్వీట్ చేశారు.