తెలంగాణలో ఆర్టీసీలో త్వరలో 34 వేలకు పైగా పోస్టులు భర్తీ

తెలంగాణ : తెలంగాణలో త్వరలో 34 వేలకు పైగా పోస్టులు భర్తీ చేస్తామని సర్కార్‌ చెబుతోంది. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్‌ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఆర్టీసీ సంస్థలో 3038 పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు. ఈ పోస్టులకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందన్నారు. కొత్త పోస్టుల భర్తతో ప్రస్తుతం వర్క్‌ చేస్తున్న ఉద్యోగులు కార్మికులపై పనిభారం తగ్గుతుందన్నారు. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా సోమవారం ఆర్టీసీ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎండీ సజ్జనార్‌ హాజరయ్యారు. అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆర్టీసీలో మూడున్నరేళ్లుగా వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నాం. భవిష్యత్‌ లోనూ ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకుసాగాలి. ఆర్టీసీలో త్వరలోనే మూడు వేలకు పైగా పోస్టులు భర్తీ చేయనున్నాం. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో సాధ్యమైనంత త్వరగా నియామకాలు పూర్తి చేస్తాం. రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని సంస్థలో మూడున్నరేళ్లుగా వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ తెలిపారు. భవిష్యత్‌ లోనూ ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకుసాగాలని ఆయన అన్నారు. కొత్తగా భర్తీ చేయనున్న ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం. ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమానికి తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం కట్టుబడి ఉందని’ పేర్కొన్నారు. అంబేద్కర్‌ జయంతి కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు రాజశేఖర్‌, మునిశేఖర్‌, ఖుస్రోషా ఖాన్‌, వెంకన్న, జాయింట్‌ డైరెక్టర్లు ఉషాదేవి, నర్మద, రంగారెడ్డి జిల్లా రీజినల్‌ మేనేజర్‌ శ్రీలత, ఆర్టీసీ సంక్షేమ సంఘాల నేతలు పాల్గొన్నారు.

➡️