కారును ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

Nov 14,2024 20:32 #road accident, #Tirupati district
  • ప్రమాదంలో తల్లి కూతు ళ్లు మృతి

ప్రజాశక్తి రామచంద్రాపురం ( తిరుపతి రూరల్‌) : కారును బస్సు ఢీకొనడంతో తల్లి కూతురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తిరుపతి రూరల్‌ మండలం పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారి వేదాంతపురం (ఆర్‌సి పురం జంక్షన్‌) వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎంఆర్‌పల్లి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ చిన్న గోవిందు తెలిపిన వివరాల మేరకు… పుల్లంపేట మండలం రంగంపల్లికి చెందిన సావిత్రి (80) వేదాంతపురంలోని ఆమె కుమారుడు రాజశేఖర్‌ రాజు ఇంటి గృహప్రవేశానికి తన కుమార్తెలు సంగీత (38) జ్యోతి, లక్ష్మి దేవిలతో కలిసి గురువారం తెల్లవారుజామున కారులో బయలుదేరారు. ఆర్‌సిపురం క్రాస్‌ వద్ద హైవేపై రోడ్డు దాటుతుండగా నల్గొండ వైపు నుండి బెంగళూరు వైపు వెళుతున్న ప్రయివేట్‌ బస్సు వేగంగా వచ్చి కారును ఢ కొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో క్షతగాత్రులను ప్రయివేట్‌ ఆస్పతికి తరలించారు. చికిత్స పొందుతూ సావిత్రి, సంగీత మృతి చెందారు. జ్యోతి, లక్ష్మి దేవిలకు చికిత్స పొందుతున్నారు. రాజశేఖర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్‌ ఎ సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

➡️