విద్యుదాఘాతంతో తల్లీ, కొడుకు మృతి

May 16,2024 16:30 #current shok, #medak

మెదక్‌: మెదక్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్‌ షాక్‌తోతల్లి, కొడుకు మఅతి చెందారు. ఈ హఅదయవిదాకర సంఘటన మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మణెమ్మకు(45) కొడుకు, కూతురు ఉన్నారు. కాగా, మణెమ్మ బట్టలు అరేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌కి గురయింది. గమనించిన కుమారుడు ప్రసాద్‌, కుమార్తె శ్రీలత తల్లిని కాపాడే ప్రయత్నంలో వారు కూడా విద్యుత్‌ షాక్‌కు గురయ్యారు. ఈ ప్రమాదంలో తల్లి, కొడుకు మఅతి చెందగా కూతురు శ్రీలతకి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీలతను చికిత్స కోసం తూప్రాన్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన తల్లి,కొడుకు మఅతి చెందడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️