నేవీ ఆయుధ డిపో ఏర్పాటుపై పునరాలోచిస్తాం : ఎంపి పుట్టా మహేష్‌ కుమార్‌

ప్రజాశక్తి – ఏలూరు : ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో ప్రతిపాదిత నేవీ ఆయుధ డిపో ప్రాజెక్టు ఏర్పాటుపై పునరాలోచన చేస్తున్నామని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.2 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే నేవీ ఆయుధ డిపో ప్రాజెక్టు ద్వారా వేలాది మంది స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అలాగే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే భావనతో ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు తాను కృషి చేసినట్లు ఎంపీ పేర్కొన్నారు. అయితే స్థానిక ప్రజల మనోభావాలు, పలు సంఘాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ ఈ ప్రాజెక్టు ఏర్పాటు ప్రక్రియపై పునరాలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. ఏది ఏమైనా ఈ ప్రాజెక్టు విషయంలో స్థానికుల అభిప్రాయాలను గౌరవిస్తామని తెలిపారు.

➡️