ఏజెన్సీ ద్వారా పనిచేస్తున్న ఉద్యోగులను కొనసాగించాలి

Feb 18,2025 00:04
  •  ఎవి నాగేశ్వరరావు, కాంతారావు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పశు సంవర్ధకశాఖలో గత మూడేళ్లుగా ఏజెన్సీ ద్వారా పనిచేస్తున్న ఉద్యోగులను కొనసాగించాలని స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట్రాక్టు అండ్‌ అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌, టీచర్స్‌, వర్కర్స్‌, ఎపి స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట్రాక్టు అండ్‌ అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌.. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఫెడరేషన్‌ జెఎసి ఛైర్మన్‌ ఎవి నాగేశ్వరరావు, కో- ఛైర్మన్‌ బి కాంతారావు సోమవారం పశుసంవర్ధకశాఖ మంత్రి, డైరెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కొనసాగిస్తూ చర్యలు చేపట్టాలని, ఖాళీల్లో మాత్రమే కొత్తవారిని నియమించాలని వారు విజ్ఞప్తి చేశారు. నూతన ఏజెన్సీతో చేసుకునే ఒప్పందంలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతనం రూ.21,500లను చెల్లించేలా, చట్ట ప్రకారం పిఎఫ్‌, ఇఎస్‌ఐ చట్ట భద్రత సౌకర్యాలు కల్పించాలని కోరారు.

➡️