హరరామ జోగయ్య
ప్రజాశక్తి-పాలకొల్లు : రాజ్యసభ సభ్యులుగా జనసేన నుంచి కొణిదెల నాగబాబుకు అవకాశం ఇవ్వాలని కాపు, బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షులు చేగొండి హరరామ జోగయ్య ఒక ప్రకటన కోరారు. ఎన్నికల ముందే పవన్ కళ్యాణ్ టిడిపితో ఒప్పందం ప్రకారం నామినేటెడ్ పదవుల్లో 30% జనసేనకు ఇస్తారని ప్రకటించారని జోగయ్య గుర్తు చేశారు. దీని ప్రకారం మూడు రాజ్యసభ సభ్యులలో ఒకటి జనసేనకు ఇవ్వాలని జోగయ్య పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు.