కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన నాగార్జున 

Oct 2,2024 17:19

కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను నాగార్జున ఖండించారు. ఎక్స్‌ వేదికగా నాగార్జున స్పందిస్తూ…”గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను… మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను” అని ట్వీట్‌ చేశారు.

➡️