నాగార్జున సాగర్‌ 16 గేట్లు ఎత్తివేత

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : నాగార్జునసాగర్‌ జలాశయానికి ఎగువ నుంచి నీటి ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్‌కు వరద వస్తుండడంతో బుధవారం అధికారులు డ్యామ్‌ 16 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయానికి 1,78,983 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో ఉంది. నీటి మట్టం కూడా పూర్తి స్థాయిలో 312 అడుగులుగా ఉంది. సాగర్‌ నుంచి నీరు విడుదల చేసిన నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు.

➡️