- జిఒ 1 విడుదల
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీల పేరుతో ఇళ్ల నిర్మాణాల పథకానికి పిఎంఎవై-ఎన్టిఆర్ నగర్లుగా ప్రభుత్వం పేరు మార్చింది. ఈ మేరకు శుక్రవారం జిఓ ఎంఎస్ నెంబరు ఒకటిని విడుదల చేసింది. ఇప్పటి వరకు ఫేజ్-1 కింద చేపట్టిన నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు ఇస్తుండగా, మరో రూ.35 వేలు రాష్ట్ర ప్రభుత్వం పావలా వడ్డీకి ప్రభుత్వ బ్యాంకుల నుంచి రుణాన్ని ఇప్పించింది. ప్రభుత్వం తాజాగా ఫేజ్-2 కింద చేపట్టనున్న ఇంటి నిర్మాణాల యూనిట్ విలువను పెంచింది. కేంద్రం ఇస్తున్న రూ.1.50 లక్షలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.లక్ష ఇవ్వనుంది. దీంతో ఒక్కో ఇంటి యూనిట్ విలువ రూ.2.50 లక్షలకు చేరుతుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ జగనన్న కాలనీల పేరును పిఎంఎవై- ఎన్టిఆర్ నగర్లుగా మార్చింది.