- ముఖ్యమంత్రికి షర్మిల లేఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విజయవాడ పశ్చిమ బైపాస్‌కు మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల… ముఖ్యమంత్రి చంద్రబాబుకు సోమవారం లేఖ రాశారు. గుంటూరు జిల్లా కాజ టోల్ గేట్ నుంచి కృష్ణా జిల్లా చిన్నఅవుటుపల్లి వరకూ 47.8 కిలోమీటర్ల మేర బైపాస్ రహదారి నిర్మాణం పూర్తి కావడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆరు వరుసల రహదారి వల్ల విజయవాడ వాసులకు ట్రాఫిక్ సమస్య చాలా వరకూ పరిష్కారమవుతుందన్నారు. వంగవీటి మోహన రంగా సేవలను గుర్తు చేసుకుంటూ పశ్చిమ బైపాస్‌కు ‘వంగవీటి మోహన రంగా బైపాస్ జాతీయ రహదారి’గా నామకరణం చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వాన్ని కోరారు.