తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం.. ఫెంగాల్‌గా నామకరణం

Nov 27,2024 18:32 #andrapradesh, #havy rains, #Tufan
  • దక్షిణ కోస్తాకు వర్ష సూచన

ప్రజాశక్తి-అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడటంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం రానున్న 12 గంటల్లో ఫెంగాల్‌ తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో 35 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. గురువారం, శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని. తెలిపింది.

గురువారం (నవంబర్‌ 28) నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. బాపట్ల, ప్రకాశం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
శుక్రవారం (నవంబర్‌ 29) నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల, బాపట్ల, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్‌ కడప, శ్రీకాకుళం, విజయనగరంలో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
శనివారం (నవంబర్‌ 30) నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, బాపట్ల, ప్రకాశం, శ్రీ సత్యసాయి, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

➡️