ఆత్మాభిమానానికి ప్రతిరూపం హరికృష్ణ : టిడిపి అధినేత చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నిండైన, ఆత్మీయతకు, ఆత్మాభిమానానికి ప్రతిరూపం నందమూరి హరికృష్ణ అని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. హరికృష్ణ 6వ వర్థంతి సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో గురువారం నివాళులర్పించారు. పొలిట్‌బ్యూరో సభ్యులుగా, మంత్రిగా, శాసనసభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా తెలుగు ప్రజలకు హరికృష్ణ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

టిడిపి కార్యాలయంలో నివాళులర్పించిన నేతలు
టిడిపి కార్యాలయంలో హరికృష్ణ వర్థంతి కార్యక్రమం జరిగింది. ఎంఎస్‌ఎంఇ, సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌.. హరికృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పి అశోక్‌బాబు, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే రామారావు, పార్టీ నాయకులు ఎవి రమణ, బుచ్చి రామ్‌ప్రసాద్‌, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️