టిడిపి ఆఫీసుపై దాడి కేసు.. హైకోర్టును ఆశ్రయించిన నందిగం సురేష్‌

ప్రజాశక్తి-అమరావతి : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదే కేసు విషయంపై తలశిల రఘురామ్‌, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, దేవినేని అవినాష్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిపింది. తదుపరి విచారణ ఈనెల 16వ తేదీకి వాయిదా వేసిన కోర్టు.. అప్పటివరకు ఎలాంటిచర్యలు తీసుకోవద్దంటూ ఆదేశించింది.

➡️