ప్రజాశక్తి-గుంటూరు : టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడి చేశారన్న కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. ఆదివారం జిల్లా జైలు నుంచి నందిగం సురేశ్‌ను అదుపులోకి తీసుకొని గుంటూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మంగళగిరికి తీసుకొచ్చారు. మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో ఆయనను విచారించనున్నారు. ఈనెల 17 మధ్యాహ్నం ఒంటిగంటకు జిల్లా జైలుకు తరలించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. విచారణ సందర్భంగా లాఠీ ఛార్జ్, దూషించడం, భయపెట్టడం వంటివి చేయవద్దని కోర్టు ఉత్తర్వులు వెల్లడించింది.
